ఆ రోజు మద్యం, మాంసం బంద్

అక్టోబర్ 2న హైదరాబాద్ నగరంలో మాంసం, మద్యం బంద్ కానుంది.

By -  Medi Samrat
Published on : 30 Sept 2025 6:31 PM IST

ఆ రోజు మద్యం, మాంసం బంద్

అక్టోబర్ 2న హైదరాబాద్ నగరంలో మాంసం, మద్యం బంద్ కానుంది. గాంధీ జయంతి కావడంతో వీటిపై నిషేధం ఉంటుంది. ఆ రోజున నగరవ్యాప్తంగా మాంసం విక్రయాలపై సంపూర్ణ నిషేధం విధిస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని రిటైల్ మాంసం దుకాణాలు, చికెన్ సెంటర్లు, స్లాటర్ హౌస్‌లను అక్టోబర్ 2న తప్పనిసరిగా మూసి ఉంచాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా ఈ నిబంధనను పాటిస్తున్నట్లు కమిషనర్ తన ప్రకటనలో గుర్తుచేశారు. జీహెచ్ఎంసీ చట్టం 1955, సెక్షన్ 533B కింద స్టాండింగ్ కమిటీ చేసిన తీర్మానం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు.

దసరా పండుగ రోజు మాంసం అమ్మకాలు అత్యధికంగా ఉంటాయి. ఈసారి గాంధీ జయంతి కారణంగా దుకాణాలు మూసివేయాలన్న ఆదేశాలు రావడంతో విక్రయదారులు ఆందోళన చెందుతున్నారు.

Next Story