తెలంగాణ రవాణా శాఖలో భారీ బదిలీలు

తెలంగాణ రవాణా శాఖలో అధికారుల బదిలీలు భారీగా జరుగుతున్నాయి. తెలంగాణ రవాణా శాఖలోని ప్రతీ అధికారి బదిలీ అయ్యేలా రవాణాశాఖ ప్రత్యేక జీవో విడుదల చేసింది

By Medi Samrat  Published on  17 Feb 2024 7:15 PM IST
తెలంగాణ రవాణా శాఖలో భారీ బదిలీలు

తెలంగాణ రవాణా శాఖలో అధికారుల బదిలీలు భారీగా జరుగుతున్నాయి. తెలంగాణ రవాణా శాఖలోని ప్రతీ అధికారి బదిలీ అయ్యేలా రవాణాశాఖ ప్రత్యేక జీవో విడుదల చేసింది. అన్ని స్థాయుల్లోని అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని ట్రాన్స్ఫర్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 150 మంది మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు (MVI), 23 మంది రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్లు(RTO), ఏడుగురు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లు(DTC) బదిలీ అయ్యారు.

తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చాక బదిలీలు భారీగా జరుగుతూ ఉన్నాయి. పలు సంస్థల్లో అధికారుల బదిలీలకు సంబంధించిన వార్తలు వింటూనే ఉన్నాం. ఇప్పటికే రెవెన్యూ, ఆబ్కారీ, పంచాయతీరాజ్‌ శాఖలో పెద్ద ఎత్తున అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. పోలీసుశాఖలో భారీగా బదిలీలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 95 మంది డీఎస్పీలను బుధవారం నాడు బదిలీ చేశారు. ఆ తర్వాతి రోజే మరో 26 మంది డీఎస్పీలను బదిలీ చేసింది.

Next Story