దేశ భద్రత కోసం మోదీని గెలిపించాలి : మంద కృష్ణ మాదిగ

దేశ భద్రత కోసం మోదీని గెలిపించాలని మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. హనుమకొండలోని ప్రెస్ క్లబ్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..

By Medi Samrat  Published on  11 May 2024 4:55 PM IST
దేశ భద్రత కోసం మోదీని గెలిపించాలి : మంద కృష్ణ మాదిగ

దేశ భద్రత కోసం మోదీని గెలిపించాలని మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. హనుమకొండలోని ప్రెస్ క్లబ్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్ అభివృద్ధి కోసం కుల, మతాల‌కు అతీతంగా బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు. వరంగల్ రూపురేఖ‌లు మార్చడానికి బీజేపీ అభ్యర్థి రమేష్ తో కలిసి నేను కృషి చేస్తానన్నారు. న్యూ శ్యామ్ పేట నిధులను నేను ముగ్గురు ముఖ్యమంత్రుల నుంచి తెప్పించాను. కేసీఆర్ నాకు అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదన్నారు.

గుండు సుధారాణి, వినయ్ భాస్కర్ ముందు ఒక ప్రతిపాదన పెట్టాను. వరంగల్ నీ పర్యాటక కేంద్రంగా మార్చడానికి మీరు ప్రతిపాదన పంపిస్తే నేను నావంతు కృషి చేస్తా అని తెలియజేయటం జరిగిందని తెలిపారు. 100 కోట్ల నిధులు కిషన్ రెడ్డి తో మాట్లాడి నావంతు కృషి చేస్తాను అని చెప్పాన‌ని.. కానీ ఏలాంటి ప్ర‌తిపాద‌న‌ చేయలేదని వివ‌రించారు. నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానిగా గెలిపించాలని కోరుకుంటున్నాను. కడియం శ్రీహరి శీల పరీక్ష చేసుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు. కడియం శ్రీహరి నిజమైనా ఎస్సీ కాదు అని రేవంత్ రెడ్డి అన్నారు. నకిలీ ఎస్సీ లను గెలిపించారాదు అని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.

Next Story