Video : కొడుకును సంచిలో చుట్టేసి చెరువులో పడేసిన తండ్రి.. ఎందుకంటే?

మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ గ్రామం వద్ద ఓ తండ్రి కొడుకుని గోనె సంచిలో కట్టి చెరువులో పడేశాడు.

By Medi Samrat  Published on  2 Aug 2024 7:17 PM IST
Video : కొడుకును సంచిలో చుట్టేసి చెరువులో పడేసిన తండ్రి.. ఎందుకంటే?

మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ గ్రామం వద్ద ఓ తండ్రి కొడుకుని గోనె సంచిలో కట్టి చెరువులో పడేశాడు. చదువును నిర్లక్ష్యం చేస్తున్నాడనే కారణంగా తండ్రి ఈ పని చేశాడు.. అయితే ఆ ఎనిమిదేళ్ల బాలుడిని గొర్రెల కాపరి రక్షించాడు. తన కుమారుడి ప్రవర్తనతో విసుగు చెందిన వ్యక్తి తీవ్రంగా కొట్టాడు. తాడుతో కట్టి, గోనె సంచిలో పెట్టాడు. అనంతరం ఆటోరిక్షాలో సంచిని తీసుకెళ్లి పట్టణ శివారులోని చెరువులో పడేశాడు.

సమీపంలో గొర్రెలు కాస్తున్న కాపరి సంచిని పారవేస్తున్న తండ్రిని చూసి ఏముంది అని అడిగాడు. అయితే ఆ సంచిలో కుక్క ఉందని చెప్పాడు. కానీ అనుమానం వచ్చిన గొర్రెల కాపరి వెంటనే ఆ సంచిని చెరువులో నుండి బయటకు తీశాడు. సంచిని తెరవగా బాలుడు బయటకు రాగానే గొర్రెల కాపరి షాక్ అయ్యాడు. ఏడుస్తూ.. పాఠశాలకు వెళ్తాను.. ఏమి చెప్పినా చేస్తాను అంటూ వేడుకున్నాడు. అతని చేతులు, కాళ్ళు కూడా తాడుతో కట్టేసి ఉంచాడు ఆ తండ్రి.

Next Story