కేటీఆర్, హరీష్ రావు పద్దతి మార్చుకోవాలి : మల్లు రవి

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యలను

By Medi Samrat  Published on  29 Jan 2024 2:28 PM IST
కేటీఆర్, హరీష్ రావు పద్దతి మార్చుకోవాలి : మల్లు రవి

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వ అధికార ప్రతినిధి మల్లు రవి ఖండించారు. గాంధీభ‌వ‌న్‌లో ఆయ‌న మాట్లాడుతూ.. కేసీఆర్ కాలి గోటికి కూడా రేవంత్ రెడ్డి సరిపొడు అంటూ కేటీఆర్ మాట్లాడిన మాటలు ఆయన అహంకారానికి పరాకాష్ట అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రజలు తీర్పు ఇస్తే ప్రజాస్వామ్య బద్దంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రంలో విప్లవాత్మక పాలన చేస్తున్నారని అన్నారు. ప్రజా రంజకంగా, ప్రజా పాలన చేస్తూ ప్రజల మనసులలో స్థానం సంపాదించారని పేర్కొన్నారు.

ప్రజాభిమానంతో సీఎంగా పని చేస్తున్న ముఖ్యమంత్రి పట్ల కేటీఆర్ ఇలా అనుచితంగా మాట్లాడ్డం ప్రజలను అవమానించడమే అవుతుందన్నారు. ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడితే ప్రజలు తిరగబడుతారని హెచ్చ‌రించారు. హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హుందాతనం లేదని అనడం ఆయన అహంకారానికి పరాకాష్ట అని విమ‌ర్శించారు. ప్రజలకు మరింత చేరువగా ఉంటూ ప్రజా పాలన చేస్తూ హుందాగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డిని ఇలా అనడం పద్దతి కాదన్నారు. కేటీఆర్, హరీష్ రావు పద్దతి మార్చుకోవాలని సూచించారు.

Next Story