ఆ మంత్రి మాట‌ల‌ను కేటీఆర్ స‌మ‌ర్థించ‌డం సిగ్గుచేటు

Mallu Ravi Fire On KTR. తెలంగాణ భాష పేరు మీద టీఆర్ఎస్ నేతలు అరాచకం చేస్తున్నారని సీఎం కేసీఆర్ కు లేఖ

By Medi Samrat  Published on  28 Aug 2021 3:45 PM IST
ఆ మంత్రి మాట‌ల‌ను కేటీఆర్ స‌మ‌ర్థించ‌డం సిగ్గుచేటు

తెలంగాణ భాష పేరు మీద టీఆర్ఎస్ నేతలు అరాచకం చేస్తున్నారని.. ఈ విష‌య‌మై సీఎం కేసీఆర్ కు లేఖ రాశామ‌ని కాంగ్రెస్ సీనియర్ నేత‌ మల్లు రవి తెలిపారు. దళితులకు బడ్జెట్ లో కేటాయించిన నిధులు ఖర్చు చేయలేదని.. క్యారీపార్వర్డ్ చేయాల్సి ఉండగా అది చేయలేదని.. అందుకే కాంగ్రెస్ దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా చేపట్టంద‌ని తెలిపారు. సీఎం కేసీఆర్ దత్తత గ్రామాల్లో అభివృద్ధి శూన్యమ‌ని.. సీఎం దత్తత తీసుకున్న గ్రామాలన్నీ మంత్రి మల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోకి వస్తాయని.. వీటికి సమాధానం చెప్పాల్సిన మల్లారెడ్డి వీధి రౌడీలా ప్రవర్తించి మాట్లాడారని ఫైర్ అయ్యారు. మంత్రి కేటీఆర్ నిన్న మీడియాతో మాట్లాడుతూ మల్లారెడ్డి మాటలను సమర్థించడం సిగ్గుచేటని విమ‌ర్శించారు. దళిత బంధుపై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రక్తం దారపోస్తానని చెబుతున్నారని.. గతంలో దళిత సీఎం అని చెప్పి మాట తప్పారని మండిప‌డ్డారు.


Next Story