Mallu Bhatti Vikramarka : చలో రాజ్ భవన్ సక్సెస్ అయ్యింది
Mallu Bhatti Vikramarka Slams on Center. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ సక్సెస్ అయ్యిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సేర్కొన్నారు.
By Medi Samrat Published on 15 March 2023 4:11 PM ISTరాజ్ భవన్ ముట్టడికి బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులు
రాజ్ భవన్ ముట్టడికి బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులు
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ సక్సెస్ అయ్యిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సేర్కొన్నారు. దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ రంగ సంస్థలు, వ్యవస్థలను ఏర్పాటు చేసి నవభారత నిర్మాణం చేసిందని తెలిపారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం.. కాంగ్రెస్ హయాంలో సృష్టించిన ప్రభుత్వ సంపదను క్రోని క్యాపిటలిస్టులకు దోచిపెడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రధాని మోదీ నిర్వీర్యం చేస్తూ వ్యవస్థలను దిగజార్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 130 కోట్ల ప్రజలకు చెందిన సంపదను కార్పొరేట్లకు పంచి పెడుతూ మోదీ ప్రజలను పేదలుగా మార్చుతున్నారని మండిపడ్డారు.
ప్రజలకు చెందిన దేశ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని పిలుపునిచ్చారు. మోదీ పాలనలో దేశం అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నదని అన్నారు. ఆదానీ ఆర్థిక నేరం గుట్టును హిడెన్ బర్గ్ సంస్థ బట్ట బయలు చేసిందన్నారు. ఎల్ఐసి లాంటి సంస్థలను దివాళా తీయించి ఆర్థిక నేరానికి పాల్పడిన ఆదానీని అరెస్టు చేయకుండా ప్రధాని మోదీ అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
ఆదానీ ఆర్థిక వ్యవహారం పై ప్రధాని మోదీ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. క్రోనీ క్యాపిటలిస్టులకు మోదీ దోచిపెడుతున్న దేశ సంపద ప్రజలకు చెందాలని కాంగ్రెస్ పార్టీ పోరాడుతున్నదని తెలిపారు. దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్న బీజేపీ పాలకులను తరిమి తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని జోష్యం చెప్పారు. పోలీసు నిర్బంధాలు, అరెస్టులు చలో రాజ్ భవన్ ఉద్యమాన్ని అడ్డుకోలేవన్నారు. ఎన్ని నిర్బంధాలు విధించినా, కేసులు పెట్టినా ప్రజల కోసం మా పోరాటం ఆగేది లేదని అన్నారు. రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తెలంగాణ వ్యాప్తంగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు.