తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యలో భారీ సంస్కరణలు..కొత్తగా ఏఈసీ గ్రూప్
తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యలో ప్రధాన సంస్కరణలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు.
By - Knakam Karthik |
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యలో భారీ సంస్కరణలు..కొత్తగా ఏఈసీ గ్రూప్
హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యలో ప్రధాన సంస్కరణలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం (2026-27) నుండి తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పులను అమలు చేయనుంది. మొదటి సంవత్సరం MPC, BiPC విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే ప్రస్తుతం 2వ సంవత్సరం విద్యార్థులకు మాత్రమే ఈ ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నారు.
మరో వైపు అన్ని సబ్జెక్టులకు ఇంటర్‌లో అన్ని సబ్జెక్టులకు కొత్త 80:20 మూల్యాంకన విధానం... ఈ ప్రకారం రాత పరీక్షకు 80 శాతం మార్కులు, ఇంటర్నల్ అసెస్‌మెంట్‌లకు 20 శాతం మార్కులు ఉంటాయి. ప్రస్తుతం ఇంగ్లీష్ సబ్జెక్టుకు మాత్రమే ఇంటర్నల్ అసెస్‌మెంట్ మార్కులు ఉన్నాయి. కొత్తగా తీసుకొచ్చన మార్పులతో సంస్కృతం, తెలుగు, గణితం తదితర అన్ని సబ్జెక్టులకు ఇంటర్నల్ మార్కులు ఉండనున్నాయి. కొత్తగా AEC (అకౌంట్స్, ఎకనామిక్స్, కామర్స్) గ్రూప్‌ను తీసుకురానున్నారు. ఎంపీసీ గ్రూప్ సబ్జెక్టులకు సిలబస్ తగ్గించనున్నారు. ఎన్‌సీఈఆర్‌టీ ప్రమాణాలకు అనుగుణంగా గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం సిలబస్‌లో మార్పులు చేయనున్నారు. ఈ సంస్కరణలు తెలంగాణ యొక్క ఇంటర్మీడియట్ విద్యను మరింత విద్యార్థులకు అనుకూలంగా, జాతీయంగా పోటీతత్వంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకున్నాయని అధికారులు తెలిపారు.