తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల‌ బదిలీ

తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఐపీఎస్ ల పునర్వ్యవస్థీకరణ జరిగింది.

By Medi Samrat  Published on  10 July 2024 7:15 PM IST
తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల‌ బదిలీ

తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఐపీఎస్ ల పునర్వ్యవస్థీకరణ జరిగింది. కొత్త డీజీపీగా డాక్టర్ జితేందర్ నియమితులైన రోజే కాంగ్రెస్ ప్రభుత్వం 15 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. తెలంగాణలో 15 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ అయ్యారు. శాంతిభద్రతల అదనపు డీజీపీగా మహేశ్‌ భగవత్‌ బదిలీ అయ్యారు. హోంగార్డులు, ఆర్గనైజేషన్‌ అదనపు డీజీగా స్వాతిలక్రా, గ్రేహౌండ్స్‌ ఏడీజీగా స్టీఫెన్‌ రవీంద్ర నియామకమయ్యారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.

పూర్తి వివరాలు:

శాంతి భద్రతల అదనపు డీజీపీగా మహేశ్‌ భగవత్‌ నియమితులయ్యారు. హోంగార్డుల, ఆర్గనైజేషన్‌ అదనపు డీజీగా స్వాతి లక్రా నియమితులయ్యారు.

గ్రేహౌండ్స్‌ ఏడీజీగా స్టీఫెన్‌ రవీంద్రను నియమించింది ప్రభుత్వం. పోలీస్‌ పర్సనల్‌ అదనపు డీజీగా విజయ్‌ కుమార్‌ (పోలీసు సంక్షేమం, క్రీడల అదనపు బాధ్యతలు) కు బాధ్యతలను అప్పగించింది. ఇక మెదక్‌ ఎస్పీగా ఉదయ్‌ కుమార్‌రెడ్డిని, వనపర్తి ఎస్పీగా ఆర్‌.గిరిధర్‌ ను నియమించింది. హైదరాబాద్‌ తూర్పు మండలం డీసీపీగా జి.బాలస్వామిని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌ పశ్చిమ మండలం డీసీపీగా జి.చంద్రమోహన్‌ ను నియమించారు. సీఏఆర్‌హెడ్‌ క్వాటర్స్‌ డీసీపీగా రక్షితమూర్తికి బాధ్యతలు ఇచ్చారు.

టీజీఎస్పీ బెటాలియన్ల అదనపు డీజీగా సంజయ్‌ కుమార్‌ జైన్ ఇకపై విధులు చేపట్టనున్నారు. రాచకొండ పోలీస్‌ కమిషనర్‌గా సుధీర్‌ బాబును నియమించింది తెలంగాణ ప్రభుత్వం. ఏసీబీ డైరెక్టర్‌గా తరుణ్‌ జోషిని నియమించినట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. మల్టీజోన్‌-1 ఐజీగా ఎస్‌.చంద్రశేఖర్‌రెడ్డి, మల్టీజోన్ -2 ఐజీగా వి.సత్యనారాయణ బాధ్యతలు చేపట్టనున్నారు. రైల్వే, రోడ్‌ సేఫ్టీ ఐజీగా కె.రమేశ్‌ నాయుడును నియమించింది తెలంగాణ ప్రభుత్వం.

Next Story