పీసీసీ అధ్యక్షుడు అయ్యాక మొదటిసారి సొంత‌ జిల్లాకు వెళ్తున్న మహేష్ కుమార్ గౌడ్

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రేపు నిజామాబాద్ జిల్లాకు వెళ్ల‌నున్నారు.

By Medi Samrat  Published on  3 Oct 2024 2:09 PM IST
పీసీసీ అధ్యక్షుడు అయ్యాక మొదటిసారి సొంత‌ జిల్లాకు వెళ్తున్న మహేష్ కుమార్ గౌడ్

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రేపు నిజామాబాద్ జిల్లాకు వెళ్ల‌నున్నారు. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడు అయ్యాక మొదటిసారి తన సొంత‌ జిల్లాకు వెళ్లనున్నారు. ఈ క్ర‌మంలో డీసీసీ ఆయ‌న‌కు భారీ స్వాగత ఏర్పాట్లు చేయ‌డంతో పాటు భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తుంది. డీసీసీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి అధ్యక్షతన నిజామాబాద్ పట్టణంలోని ఓల్డ్ కలెక్టరేట్ మైదానంలో భారీ సభ నిర్వ‌హించ‌నున్నారు. సభలో 8 మంది మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు పాల్గొంటారు.

మహేష్ కుమార్ గౌడ్ రేపు ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ నివాసం నుంచి నిజామాబాద్ బయలుదేరనున్నారు. ఉదయం 9.30 గంటలకు మేడ్చల్ చౌరస్తా కు చేరుకుంటారు. అక్కడ నుంచి గజ్వేల్ నియోజక వర్గం తూఫ్రాన్, మెదక్ నియోజకవర్గం, నర్సాపూర్ నియోజకవర్గం, కామారెడ్డి నియోజకవర్గం, డిచ్ పల్లి, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల మీదుగా నిజామాబాద్ పట్టణం చేరుకుంటారు. నిజామాబాద్ మాధవనగర్ లో సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అక్కడ నుంచి ర్యాలీగా సభాస్థలికి వెళతారు.

Next Story