కమిషన్లు దండుకొనేందుకే అధికారంలోకి వస్తామ‌ని ధీమా వ్యక్తం చేస్తున్నారు : మధు యాష్కీ

కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన ప్రజలకు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు.

By Medi Samrat  Published on  1 Dec 2023 2:23 PM GMT
కమిషన్లు దండుకొనేందుకే అధికారంలోకి వస్తామ‌ని ధీమా వ్యక్తం చేస్తున్నారు : మధు యాష్కీ

కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన ప్రజలకు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. గాంధీభవన్‌లో ఆయ‌న మాట్లాడుతూ.. తెలంగాణాలో రేపు వస్తున్న విజయం తెలంగాణ ప్రజల విజయమ‌న్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ ను వీడుతున్నాడు.. అందులో ఎలాంటి సందేహం లేదు.. పక్క సమాచారం అందిందన్నారు. ధరణి లో రాత్రికి రాత్రి భూములను, పేర్లు మార్చుకుంటున్నారని ఆరోపించారు.

రైతులకు సబ్సిడీలు ఇవ్వకుండా.. రైతు బంధు డబ్బులు రూ. 5,000 కోట్లను దారి మల్లిచేందుకు కేసీఆర్ పావులు కదుపుతున్నట్టు సమాచారం. రాష్ట్రంలో బీఆర్ఎస్‌ను సపోర్ట్ చేస్తున్న అధికారులు, కాంట్రాక్టర్లు.. ఆరిపోతున్న దీపానికి సహాకరిస్తే మీ బ్రతులు ఆగం కావాడం ఖాయమ‌ని హెచ్చ‌రించారు. రాష్ట్రంలో జరిగిన అవినీతిపై కల్వకుంట్ల కుటుంబాన్ని వదిలిపెట్టేది లేదన్నారు. సోదరి కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన అవినీతి సొమ్ము పై కూడా విచారణ జరిపిస్తామ‌న్నారు. అవినీతికి సహకరించే అధికారులు సైతం జైలుకు వెళ్లడం తప్పదన్నారు.

ప్రగతిభవన్ నుండి తరలుతున్న కోట్ల రూపాయల అవినీతి సొమ్మును అధికారులు కట్టడి చెయ్యాలన్నారు. కాంట్రాక్టర్ల వద్ద కమిషన్లు దండుకొనేందుకు అధికారంలోకి వస్తాం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఉద్యమ పార్టీ అని చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీకి ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడివి అని ప్ర‌శ్నించారు. బీజేపీ పార్టీ కి కూడా స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఉన్న‌ కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ డబ్బులు ఎక్కడ నుండి వచ్చాయో ప్రజలు గమనించాలన్నారు.

Next Story