తెలంగాణలో మద్యం బంద్ అవ్వనుంది. కౌంటింగ్ జరిగే రోజున మద్యం దొరకదని తెలుస్తోంది. మద్యం దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్బుల్లో మద్యం విక్రయించడాన్ని నిషేధించారు అధికారులు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలులో ఉంటుందని నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్ రాజ్ హెచ్చరించారు. కౌంటింగ్ రోజున మద్యం షాపులు బంద్ ఉంటాయని అధికారులు తెలిపారు.
తెలంగాణలో కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సీఈవో తెలిపారు. జూన్ 4న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని సీఈవో వెల్లడించారు. 34 కేంద్రాల్లో కౌంటింగ్ జరుగుతుందని.. 120 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశామన్నారు. పోస్టల్ బ్యాలెట్ కోసం 19 కౌంటింగ్ హాల్స్ సిద్ధం చేశామన్నారు. 12 కేంద్ర బలగాలతో కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని సీఈవో వికాస్ రాజ్ పేర్కొన్నారు.