ప్రత్యర్థుల పిల్లలను రాజకీయాల్లోకి లాగొద్దు

Let's not involve children in politics, KTR tells TRS leaders. టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, సోషల్ మీడియా వినియోగదారులకు, అభిమానుల‌కు

By Medi Samrat  Published on  26 July 2022 2:18 PM IST
ప్రత్యర్థుల పిల్లలను రాజకీయాల్లోకి లాగొద్దు

టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, సోషల్ మీడియా వినియోగదారులకు, అభిమానుల‌కు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీల‌క సూచ‌న చేశారు. రాజకీయ ప్రత్యర్థుల పిల్లలను రాజకీయాలలోకి లాగవద్దని.. వారిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని టీఆర్ఎస్ శ్రేణుల‌ను కోరారు. సైద్ధాంతిక, విధానప‌ర‌మైన అంశాలు, పనితీరు, స‌మ‌స్య‌ల‌పై ప్రతిపక్షాలపై పోరాడాలని పార్టీ శ్రేణుల‌కు దిశానిర్దేశం చేశారు.

"అబ్బాయిలు, ఈ రాజకీయ పోరాటాల నుండి పిల్లలను విడిచిపెట్టుదాం. ఇది తగదు.. ఆమోదయోగ్యం కాదు.. మన రాజకీయ ప్రత్యర్థుల పిల్లలను టార్గెట్ చేయ‌డంలో మునిగిపోవద్దని టీఆర్‌ఎస్ నాయకులు, సోషల్ మీడియా సైనికులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. సైద్ధాంతిక, పనితీరు సమస్యలు, విధానపరమైన అంశాల‌పై దృష్టి సారిద్దాం." అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.











Next Story