కాంగ్రెస్ లో చేరిన కూన శ్రీశైలం గౌడ్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ ఏప్రిల్ 5, శుక్రవారం ఉదయం
By Medi Samrat Published on 5 April 2024 5:10 PM ISTకుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ ఏప్రిల్ 5, శుక్రవారం ఉదయం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసీసీ) తెలంగాణ ఇన్‌ఛార్జ్ దీపా దాస్ మున్సి, ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో BJP అభ్యర్థిగా శ్రీశైలం గౌడ్ పోటీ చేసాడు, కానీ BRS అభ్యర్థి KP వివేకానంద్ చేతిలో ఓడిపోయాడు.ఎన్నికల ప్రచారంలో టెలివిజన్ చర్చ సందర్భంగా వివేకానంద్ గౌడ్‌పై దాడి చేసిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అయింది.
కాంగ్రెస్ సీనియర్ నాయకులు పట్నం మహేందర్‌రెడ్డి, మైనంపల్లి హన్మంత్‌రావు గౌడ్ ఇంటికి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తరపున కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానం పలికారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావాలనే భావనతో ప్రజలకు మరింత చేరువ కావాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డికి రాజీనామా లేఖ రాశారు శ్రీశైలం గౌడ్. "తెలంగాణ రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం అయ్యేందుకు, ప్రజలకు మరింత చేరువయ్యే భావనతో @INCIndia పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాను. @BJP4Telangana నా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. పార్టీలో నాకు సహకరించిన నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు." అంటూ శ్రీశైలం గౌడ్ ట్వీట్ పెట్టాడు.