కేటీఆర్ ఎడమ కాలికి గాయం

KTR's left leg injured. తెలంగాణ ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు రేపు.

By Medi Samrat  Published on  23 July 2022 12:43 PM GMT
కేటీఆర్ ఎడమ కాలికి గాయం

తెలంగాణ ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు రేపు. కేటీఆర్ పుట్టినరోజును తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలు ప్లాన్ చేసుకున్నారు. అయితే కేటీఆర్ ఎడమ కాలికి గాయమైంది. జారి పడడంతో ఎడమకాలి మడమ చీలమండలంలో క్రాక్ ఏర్పడింది. డాక్టర్ల సూచన మేరకు మూడు వారాల విశ్రాంతి తీసుకోమన్నారు.

కేటీఆర్ ఈసారి తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, ఇప్పటికే వరదల కారణంగా అనేక గ్రామాలు ముంపుకు గురైన పరిస్థితులలో జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని కేటీఆర్ నిర్ణయించుకున్నారు. అనేక జిల్లాలలో భారీ వర్షాల కారణంగా, వరదల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తన పుట్టిన రోజు వేడుకలకు బదులు టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు వారికి తమకు తోచిన మేరకు సహాయం చేయాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.

Next Story
Share it