ముఖ్యమంత్రి కేసీఆర్ నిజామాబాద్ ప్రజలను చిన్నచూపు చూస్తున్నారని బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ గుర్తుకు రాకపోయినా.. తిలక్ గార్డెన్ గుర్తుకు వచ్చి నిధులు కేటాయించారన్నారు. 100 రోజుల్లో చెరుకు ఫ్యాక్టరీని తెరుస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే.. సిరిసిల్లలో కేటీఆర్ కూడా ఓడిపోతారని అన్నారు. నిజామాబాద్ సభలో కేటీఆర్ రాజీనామా చేస్తానని చెప్పినప్పుడు అక్కడున్న ప్రజలు చప్పట్లు కొట్టారని గుర్తు చేశారు.
పసుపు బోర్డు విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడం తప్ప చేసిందేమీ లేదని కేసీఆర్, కేటీఆర్‌లపై అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2017లో రూ.30 కోట్లు స్పైస్ బోర్డు ద్వారా తీసుకొచ్చినా.. ఆ నిధులతో పసుపు పంటకు గానీ, చెరకు పంటకు గానీ ఏమీ చేయలేదు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక సామాన్యుల పరిస్థితి అధ్వానంగా మారిందని ఎంపీ అరవింద్ ఆరోపించారు.