మే 5న కేటీఆర్ హన్మకొండ పర్యటన‌

KTR to visit Hanamkonda on May 5. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ శుక్రవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

By Medi Samrat  Published on  2 May 2023 6:46 PM IST
మే 5న కేటీఆర్ హన్మకొండ పర్యటన‌

ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ శుక్రవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కాజీపేటలోని సెయింట్ గాబ్రియేల్స్ పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించడంతో పాటు పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారని పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రూ. 70 కోట్లతో న‌గ‌రంలో వ‌ర్ష‌పు నీరు ఉప్పొంగ‌కుండా చేప‌ట్టిన‌ రిటైనింగ్ వాల్‌ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించ‌నున్నారు. అలాగే సుమారు రూ.150 కోట్లతో నిర్మించ‌త‌ల‌పెట్టిన‌ పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. వీటితో పాటు బాలసముద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయం, మోడల్ వైకుంఠ‌ ధామం, సైన్స్ పార్క్‌ను ప్రారంభిస్తారని తెలిపారు. ప్ర‌భుత్వ భూముల‌లో నివాస‌ముంటున్న‌ పేదలకు జీఓ 58 కింద‌ పట్టాలు ఇవ్వ‌నున్న‌ట్లు పేర్కొన్నారు.



Next Story