మ‌రో మూడు నెల‌ల్లో కేటీఆర్ సీఎం..

KTR to become Telangana CM in Three Months. గ‌త రెండేళ్లుగా తెలంగాణ‌లో చ‌ర్చ‌కు దారితీసిన అంశాల్లో ఒక‌టి మంత్రి కేటీఆర్

By Medi Samrat
Published on : 24 Dec 2020 4:19 PM IST

మ‌రో మూడు నెల‌ల్లో కేటీఆర్ సీఎం..

గ‌త రెండేళ్లుగా తెలంగాణ‌లో చ‌ర్చ‌కు దారితీసిన అంశాల్లో ఒక‌టి మంత్రి కేటీఆర్ సీఎం ఎప్పుడు అవుతార‌ని. కేసీఆర్ జాతీయ స్థాయి రాజ‌కీయాల్లో బిజీ అవుతార‌ని.. టీఆర్ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్న మంత్రి కేటీఆర్ సీఎం అవుతార‌ని వార్త‌లు వినిపించాయి. ‌తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌లతో పాటు అధికార టీఆర్ఎస్ పార్టీలో దీని గురించి జోరుగా చ‌ర్చ సాగింది.




ఈ ఊహాగానాల‌కు డోర్నకల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే డీఎస్.రెడ్యా నాయక్ తెర దించారు. ఉగాది లోపు కేటీఆర్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. డోర్న‌క‌ల్ మున్సిపాలిటీకి 15వ ఆర్థిక సంఘం నిధుల‌తో మంజూరైన రెండు ట్రాక్ట‌ర్ల‌ను బుధ‌వారం ప్రారంభించిన అనంత‌రం ఆయ‌న మాట్లాడారు. ఈ మధ్యే తాను కేటీఆర్‌ను కలిశానని అన్నారు. ఈ సందర్భంగా ఆయనతో డోర్నకల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించానని తెలిపారు. డోర్నకల్‌కు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీని, కురవి మండలంలోని సీరోలు గ్రామాన్ని మండల కేంద్రం చేయాలని,కోరిన‌ట్లు వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా కాబోయే సీఎం కేటీఆర్ అంటూ రెడ్యానాయ‌క్ వ్యాఖ్యానించారు.


Next Story