మంత్రి కేటీఆర్‌కు క‌రోనా పాజిటివ్‌

KTR tests positive for COVID-19. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది.

By Medi Samrat  Published on  30 Aug 2022 12:52 PM GMT
మంత్రి కేటీఆర్‌కు క‌రోనా పాజిటివ్‌

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. ఈ మేర‌కు తనకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలిందని మంగళవారం ట్వీట్ చేశారు. నెగెటివ్ వచ్చే వరకూ ఇంట్లోనే ఐసోలేష‌న్‌లో ఉండ‌నున్న‌ట్లు తెలిపారు.

క‌రోనా ల‌క్ష‌ణాలు ఉండ‌టంతో ప‌రీక్ష‌లు చేయించుకున్నాన‌ని.. ప‌రీక్ష‌ల‌లో పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. ప్ర‌స్తుతం హోం ఐసోలేష‌న్‌లో ఉన్నాన‌ని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఇటీవ‌ల త‌న‌ను క‌లిసిన వారంతా క‌రోనా టెస్టులు చేయించుకోవాల‌ని, జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని కేటీఆర్ సూచించారు. గ‌తంలో 2021, ఏప్రిల్ 23న మంత్రి కేటీఆర్ క‌రోనా బారిన ప‌డ్డారు.

మంత్రి కేటీఆర్‌ ఇటీవల జూలై నెలలో కిందపడిపోవడంతో కాలికి గాయం కావడంతో మూడు వారాల పాటు పడక విశ్రాంతి తీసుకోవలసి వచ్చింది. ఇదిలావుంటే.. తెలంగాణలో సోమవారం 192 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 8,34,143కి చేరుకుంది. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 80 కేసులు నమోదయ్యాయి.


Next Story