భయపడాల్సిందేమీ లేదు..కేసీఆర్‌ హెల్త్ అప్‌డేట్‌పై కేటీఆర్ ట్వీట్

కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఎక్స్ వేదికగా స్పందించిన కేటీఆర్

By Knakam Karthik
Published on : 4 July 2025 1:42 PM IST

Former CM Kcr, Brs, Ill Health, Ktr

భయపడాల్సిందేమీ లేదు..కేసీఆర్‌ హెల్త్ అప్‌డేట్‌పై కేటీఆర్ ట్వీట్

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వల్ప అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన లేటెస్ట్ హెల్త్ అప్‌డేట్‌పై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘కేసీఆర్ రొటీన్ హెల్త్ చెకప్‌లో భాగంగా గురువారం సాయంత్రం ఆసుపత్రిలో అడ్మిట్ కావడం జరిగింది. ఆయన బ్లడ్ షుగర్ మరియు సోడియం లెవెల్స్ మానిటర్ చేయడం కోసం ఒకటి రెండు రోజులు ఆస్పత్రిలో చేరాల్సిందిగా డాక్టర్లు సూచించారు. కేసీఆర్ ఆరోగ్యం సమాచారం అడుగుతూ ఆయన క్షేమంగా ఉండాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

ఇదిలా ఉంటే.. నిన్న రాత్రే కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వైద్యులు బులిటెన్‌ విడుదల చేశారు. ‘‘కేసీఆర్‌ నీరసంగా ఉండటంతో ఈ సాయంత్రం ఆస్పత్రిలో చేరారు. ఆయన శరీరంలో బ్లడ్‌ షుగర్‌ అధికంగా, సోడియం మోతాదు తక్కువగా ఉన్నట్లు ప్రాథమిక పరీక్షల్లో వెల్లడైంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది’’ అని పేర్కొన్నారు.

Next Story