సీసీఐ యూనిట్‌ను పునరుద్ధరించండి : కేటీఆర్‌

KTR requests Piyush to renovate CCI. ఆదిలాబాద్‌లోని సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) యూనిట్‌ను పునరుద్ధరించాలని

By Medi Samrat  Published on  17 May 2022 7:46 AM GMT
సీసీఐ యూనిట్‌ను పునరుద్ధరించండి : కేటీఆర్‌

ఆదిలాబాద్‌లోని సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) యూనిట్‌ను పునరుద్ధరించాలని ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ను అభ్యర్థించారు. మంత్రి తన ట్విట్టర్ హ్యాండిల్‌లో.. సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా యూనిట్‌ను సందర్శించి పరిస్థితిని సమీక్షించాల్సిందిగా పీయూష్ గోయల్‌ను అభ్యర్థించారు. కేంద్ర మంత్రి నుంచి సానుకూల స్పందన వస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రానికి సహకరించేందుకు సిద్ధంగా ఉందని కేటీఆర్ తెలిపారు. జిల్లాలో సీసీఐ యూనిట్‌ను పునరుద్ధరిస్తే అనేక ఉపాధి అవకాశాలు వస్తాయని సూచించారు. సీసీఐ అంశంపై కేంద్రం సానుకూలంగా స్పందించాలని ఆకాంక్షించారు.

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న చేసిన‌ ట్వీట్‌ను షేర్ చేస్తూ కేటీఆర్ ఈ రిక్వెస్ట్ చేశారు. చాలా మంది యువతకు ఉపాధి కల్పించే సీసీఐని త్వరగా పునరుద్ధరించాలని జోగు రామ‌న్న‌ ట్వీట్ చేశారు. తెలంగాణలోని అటువంటి యూనిట్లను రాష్ట్ర ప్రభుత్వం రక్షించేందుకు ప్రయత్నిస్తోందని, అయితే కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ రంగాలకు అప్పగించడానికి జి.ఓలు జారీ చేసిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎమ్మెల్యే జోగు రామన్న ట్వీట్ చేసిన సీసీఐ నివేదికను కూడా కేటీఆర్ షేర్ చేశారు.








Next Story