కేసీఆర్ మాత్రమే తెలంగాణలో ఉంటారు

KTR Reacts About Rahul Gandhi Telangana Visit. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు

By Medi Samrat  Published on  7 May 2022 2:55 PM IST
కేసీఆర్ మాత్రమే తెలంగాణలో ఉంటారు

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. శుక్ర‌వారం ఆయ‌న ట్విట‌ర్ వేదిక‌గా.. పొలిటికల్ టూరిస్టులు వస్తుంటారు.. వెళ్తుంటారు.. కేసీఆర్ మాత్రమే తెలంగాణలో ఉంటారని రాహుల్ ప‌ర్య‌ట‌న‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం కేటీఆర్ పోస్టు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. రాహుల్ గాంధీ వరంగల్‌లో పర్యటించి రైతు సంఘ‌ర్ష‌ణ‌ బహిరంగ సభలో ప్రసంగిస్తూ రాష్ట్రంలోని రైతుల సమస్యలపై గళం విప్పిన సంగతి తెలిసిందే.

కేటీఆర్ ట్వీట్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణ మీకు టూరిజం స్పాట్ కావచ్చు. కాంగ్రెస్ దృష్టిలో ఈ రాష్ట్రం అమరవీరుల త్యాగఫలం. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షల ప్రతిరూపం. మీ వక్రదృష్టి ప్రకారం ఇది టూరిస్ట్ ప్లేస్ అనుకున్నా.. దానిని సృష్టించింది కూడా కాంగ్రెసే అని ట్వీట్ చేశారు.














.




Next Story