కొడంగల్‌లో బలవంతపు భూసేకరణ.. రాహుల్ గాంధీని నిలదీసిన కేటీఆర్‌

తెలంగాణలో 'బలవంతంగా' భూసేకరణపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని నవంబర్ 17 ఆదివారం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ప్రశ్నించారు.

By అంజి  Published on  17 Nov 2024 5:34 AM GMT
KTR, Rahul Gandhi, land acquisition, Telangana

కొడంగల్‌లో బలవంతపు భూసేకరణ.. రాహుల్ గాంధీని నిలదీసిన కేటీఆర్‌

తెలంగాణలో 'బలవంతంగా' భూసేకరణపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని నవంబర్ 17 ఆదివారం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ప్రశ్నించారు. రైతులకు మద్దతిస్తామన్న రాహుట్‌ గాంధీ వాదనలను కొట్టిపారేసిన కేటీఆర్.. ''రాహుల్ గాంధీ జీ.. మీరు భూసేకరణ వ్యతిరేక స్వరం వినిపిస్తే ఏం లాభం? అదాని - అంబానీలపై విరుచుకుపడితే ఏం ప్రయోజనం?'' అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ఏళ్ల తరబడి దోపిడీ చేస్తోందని సిరిసిల్ల ఎమ్మెల్యే ఆరోపించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీని తెరిచేందుకు అదానీ గ్రూప్‌ను ఎందుకు అనుమతించిందని, కొడంగల్‌లో రైతులు కన్నీటికి ఎందుకు కారణభూతమైందని ఎక్స్‌ పోస్ట్‌లో కేటీఆర్ విమర్శించారు.

''దేశవ్యాప్తంగా భూసేకరణపై మీ రణ గర్జన.. తెలంగాణలో భూసేకరణను ఎందుకు అడ్డుకోలేకపోయింది? కొడంగల్ రైతుల కన్నీటికి ఎందుకు కారణభూతమైంది? అదాని -అంబానీలపై మీ జంగ్.. రామన్నపేటలో అదాని ఫ్యాక్టరీకి ద్వారాలు ఎందుకు తెరిచింది? తెలంగాణ కాంగ్రెస్ పాలిత రాష్ట్రమే కదా!ఎందుకు అభ్యంతరం చెప్పలేదు?'' అని రాహుల్‌ గాంధీని కేటీఆర్‌ ప్రశ్నించారు. ''నేను కొట్టినట్లు చేస్తా.. నువ్వు ఏడ్చినట్లు చేయి అనే ఒప్పందమా? కుమ్మక్కు రాజకీయంలో ఇదో రహస్యమా? రేవంత్ - అదానీలతో వ్యాపార బంధమా?'' అని కేటీఆర్‌ పలు అనుమానాలను లేవనెత్తారు.

Next Story