పొత్తు ఛాన్సే లేదన్న రాహుల్ గాంధీ.. మంత్రి కేటీఆర్ స్పందన ఇదే..!

KTR mocks Rahul Gandhi, says who wants to have an alliance with Congress. తెలంగాణను దోచుకున్న దొంగలతో తాము పొత్తు పెట్టుకోబోమని, అసలు తమకు

By Medi Samrat  Published on  7 May 2022 3:42 PM GMT
పొత్తు ఛాన్సే లేదన్న రాహుల్ గాంధీ.. మంత్రి కేటీఆర్ స్పందన ఇదే..!

తెలంగాణను దోచుకున్న దొంగలతో తాము పొత్తు పెట్టుకోబోమని, అసలు తమకు ఏ పార్టీతో పొత్తు లేదని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో అన్నారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునేవారు ఎవరైనా ఉన్నారా...? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఒక కాలం చెల్లిన పార్టీ అని, ఇప్పుడా పార్టీతో పొత్తు కావాలని ఎవరైనా అడిగారా? అని ప్రశ్నించారు. ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే, దాన్ని రాహుల్ చదివారని కేటీఆర్ విమర్శించారు. సొంత నియోజకవర్గంలో ఎంపీగా గెలవలేని రాహుల్, ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారా? కాంగ్రెస్ అంత గొప్ప రైతు పార్టీ అయితే పంజాబ్ లో ఎందుకు ఓడిపోయింది? అని ప్రశ్నించారు. ఏఐసీసీ అంటే ఆలిండియా క్రైసిస్ కమిటీ అంటూ ఎద్దేవా చేశారు. వరంగల్ లో కాంగ్రెస్ ప్రకటించిన డిక్లరేషన్ లో కొత్త అంశాలేవీ లేవని, కాంగ్రెస్ నేతల మాటలు నమ్మవద్దని, కాంగ్రెస్ పార్టీని వదిలించుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ రైతులకు విజ్ఞప్తి చేస్తున్నానని కేటీఆర్ తెలిపారు.

రాహుల్ గాంధీకి..ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సవాల్ విసిరారు. రాహుల్ గాంధీకి దమ్ముంటే హైదరాబాద్ నుంచి కానీ లేక మెదక్ నుంచి పోటీచేయాలని ఓవైసీ సవాల్ విసిరారు. "ప్రస్తుతం రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో వయనాడ్ లో రాహుల్ ఓడిపోవడం ఖాయం. కాబట్టి రాహుల్ గాంధీ హైదరాబాద్ నుంచి పోటీ చేసి రాహుల్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి. హైద‌రాబాద్ కాదంటే మెదక్ లోక్ సభ నుంచి కూడా రాహుల్ గాంధీ పోటీ చేయవచ్చు"అని అన్నారు.










Next Story