మరో ఐటీ పార్కుకు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్
KTR lays foundation stone for Kandlakoya IT park. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కండ్లకోయలో ఐటీ పార్కుకు పురపాలక శాఖ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి
By Medi Samrat Published on 17 Feb 2022 5:09 PM ISTమేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కండ్లకోయలో ఐటీ పార్కుకు పురపాలక శాఖ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీ రామారావు, మంత్రి మల్లారెడ్డితో కలిసి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఐటీ పార్కు ప్రారంభంతో కండ్లకోయ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. హైదరాబాద్‌లో గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి ప్రపంచ టాప్-5 కంపెనీలు ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్‌తో పాటు అనేక కంపెనీలు హైదరాబాద్‌లో తమ ప్రధాన కార్యాలయాలను కలిగి ఉన్నాయి. నగరం పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఎంఆర్ఎఫ్ రూ. 1,000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చిందని మంత్రి చెప్పారు.
హైదరాబాద్ నగరం నలువైపులా ఐటీ విస్తరణలో భాగంగా నేడు కండ్లకోయలో తెలంగాణ గేట్ వే ఐటీ పార్కుకు శంకుస్థాపన చేసిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి @KTRTRS, కార్మిక శాఖ మంత్రి @chmallareddyMLA. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే @kp_vivekanand, ఎమ్మెల్సీలు @naveenktrs, @RajuShambipur పాల్గొన్నారు. pic.twitter.com/1FlXaUWtXo
— TRS Party (@trspartyonline) February 17, 2022
ప్రపంచంలోని మొత్తం వ్యాక్సిన్ ఉత్పత్తిలో నగరం మూడో వంతు వాటాను కలిగి ఉందని ఆయన తెలిపారు. నైపుణ్యాలను పెంపొందించుకోవడంతో ఉద్యోగాలన్నీ స్థానికులకే దక్కుతాయని.. విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుని ఉద్యోగాలు చేజిక్కించుకోవాలని ఆయన అన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తరుణంలో ముఖ్యమంత్రి పోరాటంపై మాట్లాడుతూ.. చివరి వరకు పోరాడితేనే విజయం సాధించగలమని.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడే ఓటమి రుచి చూశారని.. ఓటమి తర్వాత కేసీఆర్.. రాజకీయాల నుంచి తప్పుకుంటే.. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని.. పోరాడి సాధించుకోవాలని మంత్రి కేటీఆర్ అన్నారు.