గోల్మాల్ గుజరాత్ మోడల్ లేదా బంగారు తెలంగాణ మోడల్‌.. ఏదో ప్రజలే తేల్చుకోవాలి

KTR Key Words About Opposition. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల వ్యూహ‌క‌ర్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని

By Medi Samrat  Published on  25 April 2022 7:26 AM GMT
గోల్మాల్ గుజరాత్ మోడల్ లేదా బంగారు తెలంగాణ మోడల్‌.. ఏదో ప్రజలే తేల్చుకోవాలి

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల వ్యూహ‌క‌ర్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని IPAC బృందంతో TRS ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ మార్క్ పొలిటికల్ మలుపులు త్వరలోనే చూస్తామని అంటున్నారు. ప్ర‌శాంత్ కిషోర్ తెలంగాణ సీఎం కేసీఆర్ తో శ‌నివారం భేటీ అయ్యారు. వీరి మ‌ధ్య ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కు స‌మావేశం జ‌రిగింది. ఇందులో జాతీయ, రాష్ట్ర రాజ‌కీయాల‌పై చ‌ర్చ‌లు జ‌రిపారు. "ప్రశాంత్ కిషోర్ మాకు IPACని పరిచయం చేసారు.. వారు మాతో కలిసి పని చేస్తారు" అని మంత్రి కేటీఆర్ కూడా తెలిపారు. 'రాబోయే ఎన్నికల్లో మేము విజయం సాధిస్తామని IPAC చెప్పింది. 2014లో 10-12 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలందరూ ఇప్పుడు మేజర్లు. కేసీఆర్ సీఎంగా వారికి తెలుసు, తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర తెలియదు.. ఈ తరానికి చేరుకోవాలంటే భిన్నమైన మాధ్యమాలు, కమ్యూనికేషన్ రూపాలు కావాలి.. డిజిటల్ మీడియా విభాగంలో IPAC మాతో కలిసి పని చేస్తుంది' అని కేటీఆర్ అన్నారు.

కేవలం ప్రశాంత్ కిషోర్ మాత్రమే కాదు, సునీల్ కొనగల్ వంటి ఇతర వ్యూహకర్తలతో తాము చర్చలు జరిపామని ఆయన అన్నారు. పీకే కాంగ్రెస్‌లో చేరలేదని కేటీఆర్ అన్నారు. ప్రశాంత్‌ కిషోర్‌ ఐ-ప్యాక్‌ నుంచి వైదొలిగి సొంత రాజకీయాలు చేస్తున్నారని.. ఐ-ప్యాక్‌ టీఆర్ఎస్‌ కోసం పనిచేస్తుందని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. బీజేపీ స్థాయి అయితే అసలు పెరగడం లేదని.. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతులకు నష్టాలు రెట్టింపు అయ్యాయని అన్నారు. "బీజేపీ విఫలమైన మోడల్. కేంద్రంలో కాంగ్రెస్ ఈ సమస్యలను ప్రజల దృష్టికి తీసుకురాలేకపోవటం వల్ల, బీజేపీ పుంజుకుంటున్నట్లు కనిపిస్తోంది" అని కేటీఆర్ విమర్శించారు. గోల్మాల్ గుజరాత్ మోడల్ లేదా బంగారు తెలంగాణ మోడల్‌ను ఎంచుకోవాలని కేటీఆర్ ప్రజలను కోరారు.

అధికార వ్యతిరేకత సహజమని, నలుగురు బీజేపీ ఎంపీలు కూడా అధికార వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని కేటీఆర్ అన్నారు. రామాయంపేట, ఖమ్మం ఘటనలపై కేటీఆర్ మాట్లాడుతూ, అవి విషాదకరమైనవని.. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరం అని అన్నారు. 'ఈ ఘటనలపై టీఆర్‌ఎస్‌ స్పందించలేదని అనడం సరికాదని, లక్మీపూర్‌ ఘటనపై ప్రభుత్వం ఎలా స్పందించిందో పోల్చిచూడండి. ఆ ఘటనలో మరణాలకు సంబంధించి ప్రధాని సంతాపం కూడా వ్యక్తం చేయలేదు.' అని కేటీఆర్ అన్నారు. సాయి గణేష్ ఘటనలో అతడిని ప్రేరేపించిన పరిస్థితులేంటో ఆలోచించాలని కేటీఆర్ అన్నారు. ''ఖమ్మంలో బీజేపీకి ఏమైనా ఉనికి ఉందా? భావోద్వేగానికి గురైన ఓ వ్యక్తికి రెచ్చగొట్టి పురుగుమందుల బాటిల్‌ ఇచ్చారు. మాపై వందల సంఖ్యలో కేసులు ఉన్నాయి, అయినా ఆత్మహత్య చేసుకున్నామా? బీజేపీ కార్యకర్తలను ఎందుకు రెచ్చగొడుతున్నారు? నేను ఎక్కడికి వెళ్లినా బీజేపీ యువజన విభాగం అశాంతి సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. పురుగుమందు ఇచ్చిన వ్యక్తిపై కేసు పెట్టాలి.. బీజేపీ సాయిగణేష్‌ ను బలిపశువును చేసింది'' అని అన్నారు.

ప్రధాని చెప్పే డబుల్ ఇంజన్ అంటే.. 'మోదీ- ఈడీ' అని కేటీఆర్ అన్నారు. "వారు దానిని వారి ఇష్టానుసారం ఉపయోగిస్తున్నారు. మహాత్మా గాంధీ హంతకుడి భావజాలాన్ని ప్రధానమంత్రి ఆమోదించారు. నాథూరామ్ గాడ్సే స్వతంత్ర భారతదేశపు మొదటి ఉగ్రవాది. మీరు ఏదైతే ఒప్పుకుంటారో దాన్నే మీరు ప్రోత్సహిస్తారు. మోదీ భారతదేశ ప్రధాన మంత్రిగా ఉండాలని.. కేవలం బీజేపీ నాయకుడు లేదా RSS సిద్ధాంతాలను పాటించే వ్యక్తిలా ఉండకూడదు' అని కేటీఆర్ అన్నారు. ధ్యాస చేసే పనిపై ఉండాలి తప్ప హిజాబ్‌పై కాదు అని కేటీఆర్ అన్నారు. గవర్నర్‌ నామినేటెడ్‌ పదవి అని అన్నారు. గణతంత్ర దినోత్సవ ప్రసంగాన్ని ప్రభుత్వ ఆమోదం లేకుండా చదవడంతోనే సమస్యలు మొదలయ్యాయని అన్నారు. గవర్నర్ విషయంలో కూడా రాజకీయ ప్రభావం కనిపిస్తోందన్నారు.

2023లో ఎన్నికలు వస్తాయని.. పరిస్థితిని బట్టి చిన్న చిన్న మార్పులు ఉంటాయని.. ప్రజల ఆమోదంతో ముందుకు వెళతామని కేటీఆర్ అన్నారు. 55 ఇంచీల ఛాతీ ఒక్క వ్యక్తికే కాకుండా పేదలందరికీ ఉండాలన్నారు. బీజేపీకి కాంగ్రెస్ బలం చేకూరుస్తోందన్నారు. రాహుల్ గాంధీ వరంగల్‌పై కాకుండా అమేథీపై దృష్టి సారించాలని కోరారు. దేశ నిర్మాణానికి ఫండ్స్ ను సేకరిస్తూ ఉన్నామని అన్నారు.

కేఏ పాల్‌ అయినా, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ అయినా తమకు ప్రత్యర్థులేనని ఆయన చమత్కరించారు. బీజేపీ నేతలను కుక్కలతో పోల్చినందుకు క్షమాపణలు చెబుతున్నానని.. నేను కూడా డాగ్ పేరెంట్‌ని.. బీజేపీ నేతలు అంతకంటే దారుణంగా ఉన్నారని.. బండి సంజయ్ జోకర్, బఫూన్ అని.. జీరో కామన్ సెన్స్ ఉన్న వ్యక్తి అని కేటీఆర్ విమర్శించారు.

Next Story