బండి సంజయ్‌పై పరువు నష్టం దావా వేసిన కేటీఆర్

KTR has filed a Defamation Suit-against Bandi Sanjay. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజయ్ పై టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్‌ కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు

By Medi Samrat  Published on  13 May 2022 11:49 AM GMT
బండి సంజయ్‌పై పరువు నష్టం దావా వేసిన కేటీఆర్

బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజయ్ పై టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్‌ కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు కేటీఆర్ త‌న‌ న్యాయవాది చేత బండి సంజయ్ కి నోటీసులు జారీచేశారు. ఈనెల 11వ తేదీన బండి సంజయ్ ట్విట్టర్ లో మంత్రి కేటీఆర్ పైన నిరాధారమైన ఆరోపణలు చేశారు. బండి సంజయ్ చేసిన ఆరోపణలపైన ఆధారాలు ఉంటే బయట పెట్టాలని.. లేదంటే బహిరంగ క్షమాపణ కోరాలని కేటీఆర్ డిమాండ్ చేస్తూ.. పరువు నష్టం దావా వేస్తానని అని హెచ్చరించారు.

ఈ నేప‌థ్యంలో ఈ రోజు కేటీఆర్ న్యాయవాది నోటీసులు జారీ చేశారు. మంత్రి కేటీఆర్ పాపులారిటీని దృష్టిలో ఉంచుకొని, ఆయనపై నిరాధార పూరితమైన ఆరోపణలు చేసి ప్రచారం పొందాలన్న దురుద్దేశంతోనే బండి సంజయ్ అబద్ధాలు చెప్పారని న్యాయవాది నోటీసులో పేర్కొన్నారు. ఒక జాతీయ స్థాయి పార్టీ కి ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ ప్రజా జీవితంలోని కనీస ప్రమాణాలు పాటించకుండా.. కేవలం ప్రచారం పొందాలన్న యావతో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల అంశాన్ని తన క్లైంట్ కేటీఆర్ కి ఆపాదించే దురుద్దేశ పూర్వకమైన ప్రయత్నం చేశారని న్యాయవాది పేర్కొన్నారు.

మంత్రి కేటీఆర్ పరువుకు భంగం కలిగించేలా, అసత్య పూరిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం మంత్రి కేటీఆర్ కి పరిహారం చెల్లించడంతో పాటు చట్టప్రకారం తగిన చర్యలకు అర్హులవుతారని న్యాయవాది తన నోటీసులో పేర్కొన్నారు. 48 గంటల్లో తన క్లైంట్ కేటీఆర్ కి బేషరతుగా క్షమాపణ చెప్పాలని న్యాయవాది నోటీసులో పేర్కొన్నారు.


Next Story
Share it