నాగం జనార్దన్ రెడ్డితో కేటీఆర్, హరీశ్ రావు భేటీ
బీఆర్‌ఎస్‌లో చేరాల్సిందిగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డిని
By Medi Samrat Published on 29 Oct 2023 2:29 PM GMTబీఆర్‌ఎస్‌లో చేరాల్సిందిగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డిని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఆదివారం ఆహ్వానించారు. ఆదివారం నాడు కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన నాగం జనార్దన్‌రెడ్డిని గచ్చిబౌలిలోని ఆయన నివాసంలో వారు కొద్దిసేపటిక్రితం కలిశారు. కేటీఆర్, హరీశ్‌రావు అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన జనార్దన్ రెడ్డి త్వరలో ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో సమావేశమై తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.
ఇదిలావుంటే.. మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. నాగర్ కర్నూల్ టికెట్ కేటాయించకపోవడంతో అసంతృప్తితో ఉన్న నాగం జనార్దన్ రెడ్డి.. పార్టీకి రాజీనామా చేశారు. టికెట్ కోసం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ నేతల దృష్టికి తీసుకెళ్లినా.. టికెట్ పై హామీ దక్కలేదు. పైగా కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తనయుడు రాజేష్ రెడ్డికి నాగర్ కర్నూల్ టికెట్‌ను కేటాయించింది. దీంతో ఆగ్రహానికి గురైన నాగం జనార్ధన్ రెడ్డి.. తన అనుచరులతో సమావేశమై ఆదివారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.