మేము నిర్మిస్తే-మీరు కూల్చేస్తున్నారు.. మాది నిర్మాణం-మీది విధ్వంసం అంటూ కాంగ్రెస్ పాలనలో కూల్చివేతలపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. లక్షల నిర్మాణాలు మావి-లక్షల కూల్చివేతలు మీవి.. మూసీ నది సాక్షిగా ఇదిగిదిగో మహానగరంలో కేసీఆర్ లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు.. కాంగ్రెస్ విష ప్రచారాలు అబద్దాలు అనడానికి మరో సాక్షం ఇదే అంటూ పలు వార్త పత్రికల నివేదికలు షేర్ చేశారు.
కట్టలేదన్నారు-ప్రజలను మభ్యపెట్టాం అన్నారు-మరి లక్ష ఇండ్లు రాత్రికి రాత్రికి ఎక్కడ నుండి పుట్టుకొచ్చాయి చిట్టి అంటూ ప్రశ్నించారు. మీ పాలనలో మీ అధికారులే మీ టేబుల్ ముందు పెట్టిన డబుల్ లెక్కలు చూసి మతిపోతుందా..? కేసీఆర్ నిజం, అయన హామీలు నిజం, ఆయన మాట నిజం అని తెలిసి మింగుడుపడటం లేదా..? అని దుయ్యబట్టారు.
మీ జూటా మాటలు, మీ కుట్రలకు, మీ దిమాక్ తక్కువ పనుల డ్యామేజ్ కంట్రోల్ కు ఇవ్వాళా కేసీఆర్ నిర్మాణాలే దిక్కయ్యాయి.. కేసీఆర్ లక్ష డబుల్ నిర్మాణాలు నిజం-కేటాయింపులు నిజం.. మీ నాలుకలు తాటి మట్టలు కాకుంటే ఇంకోసారి అబద్దాలు మాట్లాడకండని సూచించారు.