మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయన వేసిన పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారని, కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కోరారు. ఈ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ కేసులో ప్రముఖ రాజకీయ నేతలు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రవణ్‌లను సాక్షులుగా కేటీఆర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఇక అక్కినేని నాగార్జున దాఖలు చేసిన క్రిమినల్ పిటిషన్ కు సంబంధించి మంత్రి కొండ సురేఖకు కోర్టు సమాన్లు జారీ చేసింది. ఈనెల 23వ తేదీన వివరణ ఇవ్వాలని మంత్రి కొండా సురేఖను కోర్టు కోరింది. నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్ట్ తదుపరి విచారణ ఈనెల 23 కు వాయిదా వేసింది.