మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు షాక్.. కేసు నమోదుకు ఆదేశం..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై వేసిన పరువునష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది.

By Medi Samrat
Published on : 2 Aug 2025 7:10 PM IST

మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు షాక్.. కేసు నమోదుకు ఆదేశం..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై వేసిన పరువునష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్‌తో పాటు నటి సమంత విడాకుల వ్యవహారంలో కేటీఆర్‌పై నిరాధార ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని నాంపల్లి కోర్టు పోలీసులను ఆదేశించింది. నిందితురాలు కొండా సురేఖపై ఆగస్టు 21వ తేదీ లోపు క్రిమినల్ కేసు నమోదు చేసి నిందితురాలికి నోటీసు జారీ చేయాలని నాంపల్లి కోర్టు స్పష్టం చేసింది. కేటీఆర్‌పైన కొండా సురేఖ నిరాధారమైన ఆరోపణలు చేశారని కేటీఆర్ న్యాయవాది వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది.

Next Story