ఆదుకుంటాం.. పేద విద్యార్థి ఐఐటీ చదువుకు మంత్రి కేటీఆర్ భ‌రోసా

KTR assures help to tribal student to go to IIT. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో ఇంజినీరింగ్ చదవాలనే కలను సాకారం

By Medi Samrat  Published on  11 Oct 2022 7:32 PM IST
ఆదుకుంటాం.. పేద విద్యార్థి ఐఐటీ చదువుకు మంత్రి కేటీఆర్ భ‌రోసా

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో ఇంజినీరింగ్ చదవాలనే కలను సాకారం చేసుకునేందుకు జన్నారం మండలం కమాన్‌పల్లి గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థికి ఐటి శాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. విద్యార్థి దీనస్థితిని వివరిస్తూ మౌనిక రాథోడ్ అనే ట్విట్టర్ యూజర్ చేసిన ట్వీట్‌పై మంత్రి స్పందించారు. చంద్రకాంత్ ను వ్యక్తిగతంగా ఆదుకుంటానని రామారావు హామీ ఇచ్చారు. చంద్రకాంత్ నాయక్‌ జేఈఈ అడ్వాన్స్‌డ్-2022లో ఎస్టీ కేటగిరీలో 787వ ర్యాంక్ సాధించి ఐఐటీ-భువనేశ్వర్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులో సీటు సంపాదించాడు. కానీ ట్యూషన్ ఫీజు రూ.35,000 చెల్లించలేక ఇబ్బంది పడుతున్నాడు. ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన చంద్రకాంత్ పరిస్థితిని మంత్రి దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు.

ఈ విష‌య‌మై కేటీఆర్ స్పందిస్తూ.. "నేను వ్యక్తిగత‌ శ్ర‌ద్ధ‌ తీసుకుంటాను" అని మంత్రి చెప్పారు. తన కార్యాలయ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని కోరారు. విద్యార్థికి ప్రీమియర్ ఇన్‌స్టిట్యూట్‌లో ఇంజినీరింగ్ చదవాలనే కలను నెరవేర్చుకునేందుకు మంత్రి హామీ దోహదపడుతుందని మౌనిక రాథోడ్ అన్నారు. చంద్రకాంత్ తల్లిదండ్రులు ఆర్థికంగా బలహీనంగా ఉన్నందున ఫీజు చెల్లించలేకపోయారని ఆమె పేర్కొంది. మంత్రి హామీపై చంద్రకాంత్ హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తుపై అనిశ్చితితో తాను నిస్పృహకు లోనయ్యానని చెప్పారు. చంద్రకాంత్ జన్నారం మండలం కిస్తాపూర్‌ గ్రామంలోని జిల్లా పరిషత్‌ సెకండరీ పాఠశాలలో ప్రాథ‌మిక విద్యాభ్యాసం, ఉట్నూర్‌లోని ఓ కళాశాలలో ఇంటర్మీడియట్‌ చదివాడు.


Next Story