ప్రజలకు దీపావళి కానుకను ప్రకటించిన ప్ర‌భుత్వం

KTR Announce Diwali Gift to People. తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం దీపావళి కానుకను ప్రకటించింది.

By Medi Samrat  Published on  15 Nov 2020 2:47 AM GMT
ప్రజలకు దీపావళి కానుకను ప్రకటించిన ప్ర‌భుత్వం

తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం దీపావళి కానుకను ప్రకటించింది. శ‌నివారం మీడియాతో మాట్లాడిన మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ .. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆస్తి పన్నులో 50శాతం రాయితీ ఇస్తున్నట్టు వెల్లడించారు. ఇది రూ.15 వేల వరకు ఆస్తిపన్ను కట్టిన వారికి వర్తించనుందని తెలిపారు. ఇక‌ ఇతర ప్రాంతాల్లో రూ.10 వేలలోపు ఆస్తి పన్నుకట్టే వారికి వర్తించనుందని వెల్లడించారు.

దీని వల్ల హైదరాబాద్‌లో 13 లక్షల 72 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని తెలిపారు. ఆస్తి పన్నులో రాయితీతో రాష్ట్రంపై రూ.130 కోట్ల భారం పడిందన్నారు. వర్షం ఆగకముందే వరద సాయం ప్రకటించిన ఘనత తమదేనన్నారు. నిజమైన వరద బాధితులు మీ-సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని కేటీఆర్ తెలిపారు.

వరద బాధితుల కోసం అదనంగా మరో రూ.70 కోట్లు కేటాయించనున్నట్టు వెల్లడించారు. రేషన్‌ కార్డు లేకపోయినా బియ్యం అందించామని‌ ఆయన పేర్కొన్నారు. దీపావళిని పురస్కరించుకొని పారిశుద్ధ్య కార్మికుల జీతాలు రూ.14,500 నుంచి రూ.17,500కి పెంపుదల చేస్తున్నట్లు ప్రకటించారు.


Next Story