ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం నేపథ్యంలో రాహుల్ గాంధీకి అభినందనలు తెలిపిన కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫైర్ అయ్యారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించడం కోసం సొంత పార్టీకి సున్నా సీట్లు అందించిన గొప్ప నాయకత్వం ఆయనదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కావడానికి బీఆర్‌ఎస్సే కారణమని కోమటిరెడ్డి ఆరోపించారు. తాము కాంగ్రెస్ పార్టీ సమరయోధులమని... తాము ఎప్పుడూ ఓటమిని అంగీకరించబోమని కోమటిరెడ్డి అన్నారు. తెలంగాణ మాదిరే తాము ఎప్పుడూ పుంజుకుంటామని చెప్పారు.
నిన్న రాహుల్ గాంధీకి కంగ్రాట్స్ చెబుతూ కేటీఆర్ గతంలో మాట్లాడిన ఓ వీడియోను పంచుకున్నారు. ''రాహుల్ గాంధీ ఉండగా బీజేపీని ఓడించడం కాంగ్రెస్‌కు సాధ్యం కాదు. ఇండియాలో మోదీకి అతిపెద్ద కార్యకర్త రాహులే. ఇక్కడ ఆయన ఉన్నన్ని రోజులు మోదీని ఆపలేరు. రీజనల్ పార్టీ నేతలు మాత్రమే మోదీని ఆపగలరు'' అంటూ వీడియోలో సెటైర్లు వేశారు.