కేటీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రాష్ట్రీయ గీతంపై మాజీమంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

By Medi Samrat  Published on  1 Jun 2024 9:00 AM GMT
కేటీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రాష్ట్రీయ గీతంపై మాజీమంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఎదురుదాడికి దిగారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మట్లాడుతూ.. కేటీఆర్ మతి భ్రమించిన వాడిలా మాట్లాడుతున్నారని విమర్శించారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్టంలో బీఆర్​ఎస్ పార్టీ పూర్తిగా కనుమరుగు అవుతుందని అన్నారు.

సోనియా లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని, ఆ విషయాన్ని కేసీఅర్ నిండు సభలో చెప్పారన్నారు. ఇక కేసీఆర్​ ప్రభుత్వంలో అన్నీ స్కాంలే జరిగాయన్నారు. రాబోయే పదేళ్లు రాష్ట్రంలో తమ ప్రభుత్వమే ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ కు మానవత్వం లేదన్నారు. ఆవిర్భావం వేడుకలకు కేసీఆర్ ను ఆహ్వానించామని, వస్తారా రారా అన్నది ఆయన విజ్ఞతకు వదిలేస్తామని అన్నారు. జూన్ లో అన్ని జిల్లాల్లో మంత్రులు పర్యటిస్తామని, అభివృద్ధి పై వరుసగా సమీక్షలు ఉంటాయన్నారు.

Next Story