ఆ మాట ఎక్కడా అనలేదని చెప్పిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

బీజేపీ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం సాగుతూ ఉంది. అయితే ఈ ప్రచారం లో ఎటువంటి నిజం లేదని

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 May 2023 8:00 AM GMT
Komatireddy Rajagopal Reddy, BJP, Congress, Telangana

ఆ మాట ఎక్కడా అనలేదని చెప్పిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

బీజేపీ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం సాగుతూ ఉంది. అయితే ఈ ప్రచారం లో ఎటువంటి నిజం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను బీజేపీ మారుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని.. ఆ ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. మునుగోడు ఉప ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరుతానని తాను ఎక్కడా అనలేదని క్లారిటీ ఇచ్చారు. గత ఆరు నెలల నుంచి తన పని తాను చేసుకుంటున్నానని బీజేపీలోనే కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీని బలహీనం చేసే కుట్రలు జరుగుతున్నాయని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

కాంగ్రెస్ పార్టీకి పదవికి రాజీనామా చేసి ప్రజల సమక్షంలో బీజేపీలో చేరానని.. నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక బీఆర్ఎస్, రేవంత్ రెడ్డి నాపై విపరీతమైన కుతంత్రాలు చేశారన్నారు. కేసీఆర్ అవినీతి డబ్బుతో మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచారని అన్నారు. మునుగోడు ఎన్నికలు నైతిక విజయం నాదే అని అందరికీ తెలుసన్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత నా పాత మిత్రులు కాంగ్రెస్ వాళ్లు ఫోన్ చేసి కాంగ్రెస్‌కి రమ్మని అడుగుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఏందో వారికి తెలియదు.. అందరూ పాదయాత్రలు చేస్తున్నారన్నారు. డబ్బు కోసం పార్టీలు మారాల్సిన అవసరం నాకు లేదన్నారు. బీజేపీ మీద నమ్మకం తోనే పార్టీలో చేరానని స్పష్టం చేశారు.

Next Story