బీఆర్ఎస్ వాళ్ళందరినీ జైలుకు పంపిస్తా : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
బీజేపీని తరిమికొట్టాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 27 April 2024 6:46 AM ISTబీజేపీని తరిమికొట్టాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గం మర్రిగూడలో కాంగ్రెస్ పార్టీ రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ.. పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ..పేదల కోసం పనిచేసే వ్యక్తులు కోమటిరెడ్డి సోదరులు.. కులం కోసం మతం కోసం పనిచేసే వారు కాదన్నారు. నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజాసేవకుడిగా పని చేస్తా.. మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తాం.. సేవకుడిలా పని చేస్తానని చెప్పారు. నేను మధ్యతరగతి కుటుంభం నుండి వచ్చిన వ్యక్తిని.. మీ బాధలు మీ కష్టాలను చూశాను.. నేను మీలో ఒకడిని.. మీ సమస్యలు పరిష్కారానికి నన్ను గెలిపించి పార్లమెంటుకు పంపించాలని కోరారు.
మునుగోడు ఎమ్మెల్యే భువనగిరి పార్లమెంటు ఎన్నికల ఇన్చార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కిరణ్ కుమార్ రెడ్డిని మూడు లక్షల మెజారిటీతో గెలిపిస్తా అని మాట ఇచ్చాను మీ అందరి సహకారంతో.. మీ అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.. కేసీఆర్ పామ్ హౌస్ లో నిద్రపోకుండా మొత్తం ప్రభుత్వ యంత్రాంగమంతా మునుగోడులో ఉన్నా భయపడని గడ్డ.. ఈ మునుగోడు గడ్డ.. ఉప ఎన్నికలలో గెలిచింది నైతికంగా నా మునుగోడు ప్రజలేనన్నారు. ఏనాడు రాజీ పడని.. భయపడని వ్యక్తిని నేను.. నా జీవితం మునుగోడు ప్రజల కోసం మునుగోడు గడ్డ కోసమే.. శివన్న గూడెం రిజర్వాయర్, డిండి రిజర్వాయర్ అసంపూర్తిగా ఉంచాడు.. కమీషన్ల కోసం కాళేశ్వరం కంప్లీట్ చేశాడు కేసీఆర్ అని మండిపపడ్డారు.
వచ్చే 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది.. పేదల కోసం పనిచేస్తుందన్నారు. నేను ఊకునే మనిషిని కాదు బీఆర్ఎస్ వాళ్ళందరినీ జైలుకు పంపిస్తానన్నారు. దమ్ముంటే మునుగోడుకురా జగదీష్ రెడ్డి అని సవాల్ విసిరారు. మునుగోడుకి చరిత్ర ఉంది.. ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తా వచ్చే నాలుగేళ్లలో పూర్తి చేస్తానన్నారు. మునుగోడు గడ్డను సస్యశ్యామలం చేస్తా.. తమ్ముడు కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించేంతవరకు.. పార్లమెంట్ ఎన్నికలు ముగిసే వరకు నేను నిద్ర పోనని అన్నారు.