ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థి కూడా గెలవడు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగారు

By Medi Samrat  Published on  14 Nov 2023 7:45 PM IST
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థి కూడా గెలవడు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగారు. కేసీఆర్ పిరికిపంద అని, తనపై పోటీకి వంద మంది సైన్యాన్ని పంపారని ఆరోపించారు. ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితని అరెస్ట్ చేయకపోవడంతోనే బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒక్కటేనని అందరికీ అర్థమైందన్నారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీ మునిగిపోతుందని తెలిసినా సోనియాగాంధీ ఇచ్చారని చెప్పుకొచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ధర్మోజి గూడెంలో ప్రజా దీవెన భారీ బహిరంగ సభలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థి కూడా గెలవరని, అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని సవాల్ విసిరారు. ఎమ్మెల్యేగా ఉండి అసెంబ్లీలో ఎన్నోసార్లు మునుగోడు కోసం మాట్లాడితే రాష్ట్ర ప్రభుత్వం పైసా కూడా ఇవ్వలేదన్నారు. తాను రాజీనామా చేస్తే ప్రజల కాళ్లు, చేతుల దగ్గరికి వచ్చి పనులు చేశారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్కసారి అవకాశం ఇవ్వండని కోరారు.

Next Story