ప్రస్తుతం బీజేపీలోనే ఉన్నా.. ఆ ఫ‌లితాల‌ తర్వాత ప్రజల ఆలోచనలో మార్పు వచ్చింది : రాజగోపాల్ రెడ్డి

Komati Reddy Rajagopal Reddy responded to the news about the change of party. పార్టీ మార్పుపై వస్తున్న వార్తలపై కోమ‌టిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు.

By Medi Samrat  Published on  24 Jun 2023 10:50 AM GMT
ప్రస్తుతం బీజేపీలోనే ఉన్నా.. ఆ ఫ‌లితాల‌ తర్వాత ప్రజల ఆలోచనలో మార్పు వచ్చింది : రాజగోపాల్ రెడ్డి

పార్టీ మార్పుపై వస్తున్న వార్తలపై కోమ‌టిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ప్రస్తుతం బీజేపీలోనే ఉన్నాన‌ని.. ఊహాగానాలు నమ్మవద్దని అన్నారు. తమ అభిప్రాయాన్ని పార్టీ హైకమాండ్ కు వివరిస్తామని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. కవిత విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందేన‌ని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారని అన్నారు. టీఆర్ఎస్, బీజేపీ మధ్య అండర్ స్టాండింగ్ ఉందని ప్రజలు భావిస్తున్నారు. వాటిని తొలగించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుంది. అందులో భాగంగానే కేటీఆర్ కు కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఇచ్చార‌ని అన్నారు. కేటీఆర్ కు కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వడాన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదని సూచించారు. నేను కాంగ్రెస్ లో చేరుతున్నట్టు మీడియా ఎక్కువ చేసి చూపిస్తుందని అన్నారు. మోదీ, అమిత్ షా తలుచుకుంటే ఇప్పటికీ తెలంగాణలో బీజేపీని అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని అన్నారు. కర్ణాటక ఎన్నికల ఫ‌లితాల‌ తర్వాత ప్రజల ఆలోచనలో కొంచెం మార్పు వచ్చినట్టు కనబడుతుందని అన్నారు.


Next Story