గత నెల రోజుల నుంచి ఫోన్ ట్యాపింగ్ అంశం తెర మీద నడుస్తోందని.. పదేళ్లు రాజకీయ దురహంకారoతో, కుటిల బుద్ధితో కేసీఆర్ రాష్ట్రాన్ని పాలించారని కాంగ్రెస్ సీనియర్ నేత కేకే మహేందర్ రెడ్డి విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా రాజ్యాంగ విలువలను, పౌర హక్కులకు తూట్లు పొడిచి తన ఇష్టానుసారంగా పాలించాలని అనుకున్నది కల్వకుంట్ల కుటుంబం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాటి నుంచి నేటి వరకూ న్యాయ ప్రకారంగా ముందుకు సాగుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ.. కేటీఆర్ డిపమేశన్ కంప్లైంట్లకు ఎవరు భయపడుతారు.. తాటాకు చప్పుళ్లకు కాంగ్రెస్ పార్టీ భయపడేది కాదన్నారు.
కేటీఆర్ ఏ నోటీసులిచ్చినా సిద్దంగా ఉన్నామన్నారు. పరువున్నొడు పరువు గురించి మాట్లాడాలి.. మీ వల్ల పరువంతా బజారులో పడిందని ఫైర్ అయ్యారు. కేటీఆర్ ముందు నీకు పరువుందా.. అనేది చూసుకోవాలి.. దొంగే దొంగ అన్నట్టుగా పిచ్చి ముదిరి పాకాన పడినట్టుగా ఉంది బీజేపీ నేతల తీరు అని విమర్శలు గుప్పించారు.