ఫోన్‌పే ద్వారా లంచాలు.. ఎనిమిది మంది ఇంజనీర్లపై వేటు..!

వినియోగదారుల నుండి లంచం తీసుకున్నారనే ఆరోపణలపై తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGSPDCL) ఎనిమిది మంది ఇంజనీర్లను సస్పెండ్ చేసింది.

By -  Medi Samrat
Published on : 20 Feb 2026 1:34 PM IST

ఫోన్‌పే ద్వారా లంచాలు.. ఎనిమిది మంది ఇంజనీర్లపై వేటు..!

వినియోగదారుల నుండి లంచం తీసుకున్నారనే ఆరోపణలపై తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGSPDCL) ఎనిమిది మంది ఇంజనీర్లను సస్పెండ్ చేసింది. ఆసక్తికరంగా నిందితులలో కొందరు లంచం డబ్బును స్వీకరించడానికి డిజిటల్ చెల్లింపు వేదిక `PhonePe'ని ఉపయోగించారు. సస్పెండ్ అయిన వారిలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్లు (ADEలు), అసిస్టెంట్ ఇంజనీర్లు (AEలు), సబ్-ఇంజనీర్లు ఉన్నారు.

ఫిబ్రవరి 18, 2025న బాధ్యతలు స్వీకరించిన వెంటనే TGSPDCL మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ అలీ ఫరూఖీ ఏర్పాటు చేసిన యాంటీ బ్రిబ్ సెల్ (ABC), వినియోగదారుల నుండి లంచాలు అడుగుతున్న ఎనిమిది మంది అధికారులను కనుగొంది. కొందరు ఫోన్ ద్వారా ముడుపులు డిమాండ్ చేస్తూ పట్టుబడ్డారు.

ప్రజల నుండి డబ్బు వసూలు చేశారనే ఆరోపణలతో TGSPCL ఇంజనీరింగ్ అధికారులను వెంటనే సస్పెండ్ చేసింది. "సస్పెండ్ చేయబడిన అధికారులు డబ్బు తీసుకున్నారని నిర్ధారించబడింది. లంచం డబ్బును కుటుంబం, స్నేహితులు, బినామీ ఖాతాలకు మళ్లించారు. లంచం డబ్బును బదిలీ చేయడానికి కొంతమంది అధికారుల వద్ద రెండు ఫోన్లు ఉన్నట్లు గుర్తించామ‌ని అని ఒక అధికారి తెలిపారు.

కొత్త విద్యుత్ కనెక్షన్లు, ప్యానెల్ బోర్డులు ఏర్పాటు చేయడం, ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు చేయడం కోసం ఈ అధికారులు భారీగా లంచాలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపిస్తూ ABCకి గతంలో అనేక ఫిర్యాదులు అందాయి. PhonePe వంటి డిజిటల్ చెల్లింపు ప్లాట్‌ఫామ్‌ల ద్వారా అధికారులు లంచాలు స్వీకరించారని దర్యాప్తులో తేలింది.

"TGSPCL లో లంచం నిరోధక విభాగాన్ని ఏర్పాటు చేయడం చాలా ముఖ్యం. రాష్ట్ర అవినీతి నిరోధక బ్యూరోకు ఫిర్యాదులు పంపబడినప్పుడు, నిఘా సంస్థలు ఒక ఉచ్చును ప్లాన్ చేస్తాయి లేదా అక్ర‌మ‌ ఆస్తుల కేసును నమోదు చేస్తాయి. ఈ ప్రక్రియ సమయం తీసుకునేది కాబట్టి 90 శాతం కేసులు వెలుగులోకిరావు. TGSPCL అవినీతిని వెంటనే పరిష్కరించాలని కోరుకుంటుంది. మరింత చురుగ్గా ఉండాలని భావిస్తోంది" అని ముషారఫ్ అలీ ఫరూఖీ న్యూస్‌మీటర్‌తో అన్నారు.

ఫిర్యాదులను వెంటనే పరిష్కరించడానికి ABCని స్థాపించామని ఆయన అన్నారు. అధికారులు వివిధ స్థాయిల దర్యాప్తు నిర్వహిస్తారు. ప్రాథమికంగా ప్రమేయం ఉన్నట్లు నిర్ధారించబడిన తర్వాతే చర్యలు తీసుకుంటారు.

అధికారులను సస్పెండ్ చేయడం ఇది మొదటిసారి కాదని ఫరూఖీ పేర్కొన్నారు. గతంలో ఆరు నుంచి ఏడుగురు అధికారులను సస్పెండ్ చేశారు. "నేరం నిర్ధారణ అయినప్పుడు, సంబంధిత స్థానిక కార్యాలయానికి ప్రధాన కార్యాలయం ప్రమేయం ఉన్న అధికారులను సస్పెండ్ చేయాలని లేఖ రాస్తుంది. ఒత్తిడి కారణంగా, ఆరు నుంచి ఏడుగురు ఉద్యోగులపై గతంలో జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వులను అమలు చేయలేదని నాకు సమాచారం అందింది. విభాగాధిపతులను వివరణ కోరడం జరిగింది. ఈసారి TGSPCL ప్రధాన కార్యాలయం సస్పెన్షన్ ఉత్తర్వు జారీ చేసింది. విచారణ జరిగే వరకు అధికారులు సస్పెండ్ చేయబడతారు, ”అని ఆయన అన్నారు.

ప్రజలకు సందేశం..

వినియోగదారులు ఏ మధ్యవర్తిని సంప్రదించవద్దని లేదా లంచం ఇవ్వవద్దని అభ్యర్థించబడింది. శాఖలోని ఉన్నతాధికారుల దృష్టికి సమస్యలను తీసుకురండి. కొత్త విద్యుత్ కనెక్షన్, ట్రాన్స్‌ఫార్మర్ల మంజూరు లేదా ప్యానెల్ బోర్డులను ఏర్పాటు చేయడానికి లైన్ మ్యాన్ లేదా విద్యుత్ అధికారి లంచం డిమాండ్ చేస్తే TGSPDCL యాంటీ బ్రిబరీ సెల్‌కు 04023454884 లేదా 7680901912 నంబర్లకు కాల్ చేయండి.

Next Story