బీఆర్‌ఎస్‌కు మరో ఎదురుదెబ్బ..!

బీఆర్‌ఎస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో బుధవారం మరో ముగ్గురు కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరారు.

By -  Medi Samrat
Published on : 7 Jan 2026 6:50 PM IST

బీఆర్‌ఎస్‌కు మరో ఎదురుదెబ్బ..!

బీఆర్‌ఎస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో బుధవారం మరో ముగ్గురు కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో కాంగ్రెస్ కండువాలు కప్పి వారిని పార్టీలోకి అధికారికంగా స్వాగతించారు. కాంగ్రెస్‌లో చేరిన కార్పొరేటర్లలో రాధ, తోట ఉమా రాణి, రుద్రగాని శ్రీదేవి ఉన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేతృత్వంలో చేరికల కార్యక్రమం జరిగింది.

గతంలో సీహెచ్ లక్ష్మి, జి. చంద్రకళ, డి. సరస్వతి, అమృతమ్మ, ఎం.శ్రావణి సహా ఐదుగురు కార్పొరేటర్లు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. కొత్తగా చేరిన కార్పొరేటర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే రాగమయి, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Next Story