మేనిఫెస్టో అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ కృషి అభినందనీయం అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కొనియాడారు. టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హామీలను అమలు చేసే ఏకైక పార్టీగా కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. తెలంగాణలో పరిపాలన బాగుంది.. పార్టీ కార్యకర్తల పనితీరు బావుందని కితాబిచ్చారు.
50 ఏళ్ల క్రితం జరిగిన ఎమర్జెన్సీ గురించి మాట్లాడే బీజేపీ నేతలు.. 11 ఏళ్ల వారి పాలనలోని ఎమర్జెన్సీ పరిస్థితులు గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. పార్టీ మీ అందరికీ ఇచ్చిన పదవులను సద్వినియోగం చేసుకోవాలని శ్రేణులకు సూచించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే.. సమర్ధులకు పదవులు ఇవ్వాల్సిందిగా టీపీసీసీ చీఫ్ కి సూచిస్తున్నా.. పార్టీ నేతలు ఇష్టానుసారం మాట్లాడొద్దు.. పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి ఒకే తాటిపై నిలవాలని సూచించారు.