సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటకు ప్రధాన కారకుడు బౌన్సర్ ఆంటోని అంటూ పోలీసులు ఆరోపిస్తున్నారు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకు న్నారు. బౌన్సర్లకు ఆర్గనైజర్ గా ఆంటోనీ పనిచేస్తున్నారు. అల్లు అర్జున్ వచ్చే సమయంలో ఈ బౌన్సర్లు అతి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణలో బౌన్సర్లు అతి చేస్తే తాట తీస్తామంటూ ఇప్పటికే పోలీస్ బాస్ లు తేల్చి చెప్పారు.
పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై నమోదైన కేసులో అల్లు అర్జున్ పోలీసు విచారణ ముగిసింది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఉదయం 11 గంటలకు పోలీసు అధికారులు అల్లు అర్జున్ ను ప్రశ్నించారు.