భారీ వర్షాలపై అధికారులకు కేసీఆర్ ఆదేశాలు

KCR's instructions to officials on heavy rains. హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదివారం మధ్యాహ్నం అధికారులతో

By అంజి  Published on  11 July 2022 4:33 AM GMT
భారీ వర్షాలపై అధికారులకు కేసీఆర్ ఆదేశాలు

హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదివారం మధ్యాహ్నం అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోదావరిలో సమ్మక్క బ్యారేజీ దగ్గర నీటి ప్రవాహం ఎక్కువగా ఉందన్నారు. కొన్ని జిల్లాల్లో నీటి మట్టాలు పెరుగుతున్నాయని, అన్ని చోట్ల సహాయక బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. 2-3 ఐఏఎఫ్ హెలికాప్టర్లు కూడా సిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పారు. వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు, డ్యాంలలో నీటి పరిస్థితిపై కేసీఆర్ ఆరా తీశారు.

KCR's instructions to officials on heavy rainsకాగా, తెలంగాణ ప్రభుత్వం ఆదివారం రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు మూడు రోజులు సెలవులు ప్రకటించింది. ఆర్టీసీ డ్రైవర్లు నిదానంగా వాహనాలు నడపాలని ప్రభుత్వం ఆదేశించినట్లు కేసీఆర్ తెలిపారు. అలాగే పాత ఇళ్లలో నివసిస్తున్న వారిని తరలించాలని గుర్తించి ఆయా జిల్లాల కలెక్టర్లకు తెలియజేశామన్నారు. ప్రజలు ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల కంట్రోల్‌ రూమ్‌లను ప్రారంభించినట్లు కేసీఆర్‌ తెలిపారు. కంట్రోల్ రూమ్‌లు 24 గంటల పాటు పనిచేస్తాయని, ప్రజలరే అందుబాటులో ఉంటాయని చెప్పారు.

Next Story
Share it