పంట నష్టపోయినప్పటికీ తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు (కెసిఆర్) పరిహారం చెల్లించలేదని.. పంజాబ్‌లోని రైతులకు మాత్రం ఒక్కొక్కరికి రూ. 3 లక్షల చొప్పున చెల్లించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ బీహార్ పర్యటన ఉద్దేశమేమిటని బండి సంజయ్ ప్రశ్నించారు.
తెలంగాణ సీఎం బుధవారం ప్రత్యేక విమానంలో బీహార్ రాజధాని పాట్నా చేరుకుని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో భేటీ కానున్నారు. గాల్వాన్ వ్యాలీలో అమరులైన ఐదుగురు సైనికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు, సికింద్రాబాద్ టింబర్ డిపోలో అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 12 మంది బీహారీ కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియాను కేసీఆర్ అందజేయనున్నారు. అనంతరం ఇద్దరు సీఎంలు జాతీయ రాజకీయాలపై చర్చించనున్నారు.
రైతు సంఘాల ప్రతినిధులతో కేసీఆర్ నిర్వహించిన సమావేశానికి తెలంగాణ రైతులను ఆహ్వానించకపోవడంపై బండి సంజయ్ మండిపడ్డారు. తెలంగాణ సీఎం బీహార్ పర్యటనను మతపరమైన పర్యటనగా అభివర్ణించారు.