హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నిర్వహించిన విచారణ ముగిసింది. నందినగర్‌లోని ఆయన నివాసంలో దాదాపు నాలుగు గంటల 50 నిమిషాల పాటు సాగిన ఈ విచారణను ఆరుగురు సభ్యులతో కూడిన సిట్ బృందం నిర్వహించింది. విచారణ సందర్భంగా పలు ఆధారాలను కేసీఆర్ ముందుంచి ప్రశ్నించిన సిట్ అధికారులు, గతంలో విచారణకు హాజరైన వారి స్టేట్మెంట్లను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు సంధించినట్లు సమాచారం.
ఎమ్మెల్యే కొనుగోలు కేసు, ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న పరిణామాలు, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కేసీఆర్ స్టేట్‌మెంట్‌ను సిట్ రికార్డు చేసింది. అలాగే ఎస్‌ఐబీలో కీలక నియామకాలపై కూడా సిట్ ప్రశ్నించినట్లు తెలిసింది. విచారణ ముగిసిన అనంతరం కేసీఆర్ స్టేట్మెంట్‌పై సంతకాలు తీసుకున్నారు. తరువాత కేసీఆర్ కేటీఆర్, హరీష్ రావు, న్యాయవాదులతో భేటీ అయ్యారు.