పార్టీని వీడి దొంగలతో కలిసేవారి గురించి బాధలేదు : కేసీఆర్

బీఆర్‌ఎస్ నేత‌, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య శుక్రవారం న్యూఢిల్లీలో ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్‌ దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.

By Medi Samrat  Published on  28 Jun 2024 2:33 PM GMT
పార్టీని వీడి దొంగలతో కలిసేవారి గురించి బాధలేదు : కేసీఆర్

బీఆర్‌ఎస్ నేత‌, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య శుక్రవారం న్యూఢిల్లీలో ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్‌ దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే . కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్‌ఎస్ ఇప్పటికే కోర్టును ఆశ్రయించింది. ఫిరాయింపులపై మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని కాంగ్రెస్ ఉల్లంఘించిందని ఆ పార్టీ విమర్శిస్తోంది.

ఈ పరిణామాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. పార్టీని వీడి దొంగలతో కలిసేవారి గురించి బాధలేదన్నారు. తెలంగాణ సాధించిన మనకు ఇలాంటి ఒడిదుడుకులు ఓ లెక్కనా అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీ మారడంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీని ఆయన వదిలి వెళ్లిపోయారన్నారు. 2001లో పార్టీ పెట్టినప్పుడు ఆయన లేరని.. మధ్యలో వచ్చిన వారు మధ్యలోనే వెళ్లిపోతారని విమర్శించారు. అలాంటి వారితో పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు. ఎవరూ అధైర్యపడవద్దని సూచించారు. కార్యకర్తల నుంచే మంచి నాయకుడిని తయారు చేస్తానన్నారు. పార్టీయే నాయకులను తయారు చేస్తుంది తప్ప నాయకులు పార్టీని ప్రభావితం చేయలేరన్నారు.

Next Story