జాతీయ పార్టీ పేరుతో మునుగోడు ఎన్నికల బరిలో ఉంటాం : సీఎం కేసీఆర్

KCR Key Comments On Formation Of National Party. తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పేరును దసరా రోజున ప్రకటించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

By Medi Samrat
Published on : 2 Oct 2022 5:26 PM IST

జాతీయ పార్టీ పేరుతో మునుగోడు ఎన్నికల బరిలో ఉంటాం : సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పేరును దసరా రోజున ప్రకటించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. మంత్రులు, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులతో హైదరాబాదులో సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా లు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ భవన్ లో దసరా రోజున టీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు. అదే రోజున జాతీయ పార్టీ పేరు ప్రకటించనున్నారు. డిసెంబరు 9న ఢిల్లీలో కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.

ఆదివారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ మంత్రులు, జిల్లాలో అధ్యక్షులతో ఏర్పాటు చేసిన సమావేశం ముగిసింది. ఈ భేటీలో తాజా రాజకీయాలు, కొత్త పార్టీ ఏర్పాటుపై చర్చ జరిగింది. డిసెంబర్‌ 9వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో కేసీఆర్‌ భారీ బహిరంగ సభకు నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణభవన్‌లో దసరా రోజున టీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశం జరుగనుంది. అదే రోజున జాతీయ పార్టీపై ప్రకటన చేయనున్నారు. జాతీయ పార్టీ పేరుతో మునుగోడు ఎన్నికల బరిలో ఉంటామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఈసారి మునుగోడు బరిలో మూడు జాతీయ పార్టీలు ఉంటాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. . మునుగోడులో అన్ని సర్వేలు టీఆర్‌ఎస్‌కే అనుకూలంగా ఉన్నాయని అన్నారు.


Next Story