నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేసీఆర్.. ఉద్యోగ జాతర
KCR Good News to Employees. తెలంగాణలోని నిరుద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు.
By Medi Samrat Published on
13 Dec 2020 12:31 PM GMT

తెలంగాణలోని నిరుద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. తెలంగాణలో భారీగా ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్నప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. త్వరలో ఆయా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని సీఎస్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఉపాధ్యాయ, పోలీసుతో పాటు అన్ని శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలను సేకరించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు ప్రాథమికంగా సమాచారం. త్వరలోనే ఆయా ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనుంది.
తెలంగాణలో కొన్ని వేలమంది నిరుద్యోగులు ఈ నోటిఫికేషన్ కోసం ఎంతో అత్రుతగా ఎదురుచూస్తున్నారు. వేల సంఖ్యలో ఉపాధ్యాయులు, పోలీసుల రిక్రూట్మెంట్ జరగాల్సి ఉంది. ఏ శాఖలో ఎంతమంది అవసరమో లెక్క తేల్చాక దానికి అనుగుణంగా నోటిఫికేషన్లు విడుదల చేసి భర్తీ చేయాలని కేసీఆర్ సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో త్వరలోనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉంది.
Next Story